మౌంట్ మౌంగునయి(న్యూజిలాండ్): వెస్టిండీస్‌తో ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన మూడో టెస్టులో న్యూజిలాండ్ 323 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కివీస్ 2-0తో కైవసం చేసుకుంది. చివరి వరకు నువ్వానేనా అన్నట్లు తలపడ్డ పోరులో విండీస్‌పై కివీస్‌దే పైచేయి అయ్యింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 462 పరుగుల లక్ష్యఛేదన కోసం ఓవర్‌నైట్ స్కోరు 43/0తో సోమవారం బ్యాటింగ్‌కు దిగిన విండీస్..జాకబ్ డఫీ(5/42) ధాటికి 138 పరుగులకే కుప్పకూలింది.
ఓపెనర్ బ్రాండన్ కింగ్(67) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. గాయాలతో ప్రధాన బౌలర్లు సిరీస్‌కు దూరమైన వేళ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ డఫీ తనదైన పేస్‌తో విండీస్ భరతం పట్టాడు. నిప్పులు చెరిగే స్వింగ్‌తో విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపెట్టాడు. బ్రాండ్కింగ్తో మొదలైన డఫీ వికెట్ల వేట జేడన్ సీల్స్(0)తో ముగిసింది. ఈ క్రమంలో ఒక ఏడాది టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రిచర్డ్ హ్యాడ్లీ(80) రికార్డును డఫీ తాజాగా అధిగమించాడు. కాన్వెకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, డఫీకి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ దక్కాయి.