హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత ఫుట్బాల్ జట్టుకు ఐదుగురు తెలంగాణ ప్లేయర్లు ఎంపికయ్యారు. మయన్మార్ వేదికగా అక్టోబర్ 7 నుంచి 11 తేదీ వరకు జరిగే ఏఎఫ్సీ ఫుట్సల్ ఆసియా కప్ టోర్నీ కోసం ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరంలో జాతీయ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేయనున్నారు. మొహలీలో మొదలయ్యే శిబిరంలో రాష్ట్రం నుంచి ఇబాదుల్లా ఖాన్, ఇబ్రహీం అలీ, షేక్ ఉమైర్, జుబైర్బిన్ సుల్తాన్, జావెద్ హుస్సేన్ పాల్గొంటున్నారు.