న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) షెడ్యూల్ ఖరారైంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, తొలి టైటిల్ కోసం ఆరాటపడుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఏప్రిల్ 9న చెన్నై వేదికగా జరుగనున్న పోరుతో 14వ సీజన్ ప్రారంభం కానున్నది. టోర్నీకి అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై వేదికలుగా ఉన్నాయి. అయితే ఏ జట్టుకు కూడా సొంత స్టేడియంలో మ్యాచ్‌లు లేవు. లీగ్ దశలో ప్రతీజట్టు నాలుగు వేదికల్లో మ్యాచ్‌లు ఆడనుంది. ఈ వివరాలను ఐపీఎల్ పాలక మండలి ఆదివారం వెల్లడించింది. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నా ముంబైను వేదికగా ఎంపిక చేయగా.. హైదరాబాద్‌కు అవకాశం దక్కలేదు. లీగ్ దశలో మొత్తంగా చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు పదేసి మ్యాచ్‌లకు, ఢిల్లీ, అహ్మదాబాద్ చెరో 8 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి. ప్లే ఆఫ్స్ సహా మే 30న ఫైనల్ కూడా ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియమైన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ మైదానంలో జరుగనున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో మే 6 తర్వాతే కోల్‌కతాలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. మొత్తంగా షెడ్యూల్లో 11 రోజులు డబుల్ హెడర్స్ ఉన్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3.30 గంటలకు, సాయంత్రం మ్యాచ్‌లు 7.30కు మొదలుకానున్నాయి. కాగా కరోనా ప్రభావం నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు నిర్వహించాలని ఐపీఎల్ పాలక మండలి ప్రాథమికంగా నిర్ణయించింది. దేశంలో మహమ్మారి విజృభించడంతో గతేడాది 13వ సీజన్‌ను యూఏఈలో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా ప్రభావం తగ్గడంతో భారత్‌లోనే జరిపేందుకు సిద్ధమైంది.
ఐపీఎల్ 2021 షెడ్యూల్
తేదీ మ్యాచ్ వేదిక సమయం
ఏప్రిల్ 09 ముంబై x బెంగళూరు చెన్నై రా.7.30 గం.
10 చెన్నై x ఢిల్లీ ముంబై రా.7.30 గం.
11 హైదరాబాద్ x కోల్‌కతా చెన్నై రా.7.30 గం.
12 రాజస్థాన్ x పంజాబ్ ముంబై రా.7.30 గం.
13 కోల్‌కతా x ముంబై చెన్నై రా.7.30 గం.
14 హైదరాబాద్ x బెంగళూరు చెన్నై రా.7.30 గం.
15 రాజస్థాన్ x ఢిల్లీ ముంబై రా.7.30 గం.
16 పంజాబ్ x చెన్నై ముంబై రా.7.30 గం.
17 హైదరాబాద్ x ముంబై చెన్నై రా.7.30 గం.
18 బెంగళూరు x కోల్‌కతా చెన్నై మ.3.30 గం.
ఢిల్లీ x పంజాబ్ ముంబై రా.7.30 గం.
19 చెన్నై x రాజస్థాన్ ముంబై రా.7.30 గం.
20 ఢిల్లీ x ముంబై చెన్నై రా.7.30 గం.
21 హైదరాబాద్ x పంజాబ్ చెన్నై మ.3.30 గం.
కోల్‌కతా x చెన్నై ముంబై రా.7.30 గం.
22 బెంగళూరు x రాజస్థాన్ ముంబై రా.7.30 గం.
23 పంజాబ్ x ముంబై చెన్నై రా.7.30 గం.
24 రాజస్థాన్ x కోల్‌కతా ముంబై రా.7.30 గం.
25 చెన్నై x బెంగళూరు ముంబై మ.3.30 గం.
హైదరాబాద్ x ఢిల్లీ చెన్నై రా.7.30 గం.
26 పంజాబ్ x కోల్‌కతా అహ్మదాబాద్ రా.7.30 గం.
27 ఢిల్లీ x బెంగళూరు అహ్మదాబాద్ రా.7.30 గం.
28 హైదరాబాద్ x చెన్నై ఢిల్లీ రా.7.30 గం.
29 ముంబై x రాజస్థాన్ ఢిల్లీ మ.3.30 గం.
ఢిల్లీ x కోల్‌కతా అహ్మదాబాద్ రా.7.30 గం.
30 పంజాబ్ x బెంగళూరు అహ్మదాబాద్ రా.7.30 గం.
మే 01 ముంబై x చెన్నై ఢిల్లీ రా.7.30 గం.
02 హైదరాబాద్ x రాజస్థాన్ ఢిల్లీ మ.3.30 గం.
పంజాబ్ x ఢిల్లీ అహ్మదాబాద్ రా.7.30 గం.
03 కోల్‌కతా x బెంగళూరు అహ్మదాబాద్ రా.7.30 గం.
04 హైదరాబాద్ x ముంబై ఢిల్లీ రా.7.30 గం.
05 రాజస్థాన్ x చెన్నై ఢిల్లీ రా.7.30 గం.
06 బెంగళూరు x పంజాబ్ అహ్మదాబాద్ రా.7.30 గం.
07 హైదరాబాద్ x చెన్నై ఢిల్లీ రా.7.30 గం.
08 కోల్‌కతా x ఢిల్లీ అహ్మదాబాద్ మ.3.30 గం.
రాజస్థాన్ x ముంబై ఢిల్లీ రా.7.30 గం.
09 చెన్నై x పంజాబ్ బెంగళూరు మ.3.30 గం.
హైదరాబాద్ x బెంగళూరు కోల్‌కతా రా.7.30 గం.
10 ముంబై x కోల్‌కతా బెంగళూరు రా.7.30 గం.
11 ఢిల్లీ x రాజస్థాన్ కోల్‌కతా రా.7.30 గం.
12 చెన్నై x కోల్‌కతా బెంగళూరు రా.7.30 గం.
13 ముంబై x పంజాబ్ బెంగళూరు మ.3.30 గం.
హైదరాబాద్ x రాజస్థాన్ కోల్‌కతా రా.7.30 గం.
14 బెంగళూరు x ఢిల్లీ కోల్‌కతా రా.7.30 గం.
15 కోల్‌కతా x పంజాబ్ బెంగళూరు రా.7.30 గం.
16 రాజస్థాన్ x బెంగళూరు కోల్‌కతా మ.3.30 గం.
చెన్నై x ముంబై బెంగళూరు రా.7.30 గం.
17 హైదరాబాద్ x ఢిల్లీ కోల్‌కతా రా.7.30 గం.
18 కోల్‌కతా x రాజస్థాన్ బెంగళూరు రా.7.30 గం.
19 హైదరాబాద్ x పంజాబ్ బెంగళూరు రా.7.30 గం.
20 బెంగళూరు x ముంబై కోల్‌కతా రా.7.30 గం.
21 హైదరాబాద్ x కోల్‌కతా బెంగళూరు మ.3.30 గం.
ఢిల్లీ x చెన్నై కోల్‌కతా రా.7.30 గం.
22 పంజాబ్ x రాజస్థాన్ బెంగళూరు రా.7.30 గం.
23 ముంబై x ఢిల్లీ కోల్‌కతా మ.3.30 గం.
బెంగళూరు x చెన్నై కోల్‌కతా రా.7.30 గం.
25 క్వాలిఫయర్ -1 అహ్మదాబాద్ రా.7.30 గం.
26 ఎలిమినేటర్ అహ్మదాబాద్ రా.7.30 గం.
28 క్వాలిఫయర్ -2 అహ్మదాబాద్ రా.7.30 గం.
30 ఫైనల్ అహ్మదాబాద్ రా.7.30 గం.