అనుమానాస్పదస్థితిలో నర్సింగ్ విద్యార్థిని మృతి
నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఇంద్రవెల్లి రాజేశ్వరి, సతీశ్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మూడేండ్ల క్రితం తండ్రి సతీశ్ అనారోగ్యంతో మృతిచెందడంతో తల్లి రాజేశ్వరి కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను చదివిస్తున్నది.
- నిందితులను శిక్షించాలని జూలూరుపాడులో రాస్తారోకో
జూలూరుపాడు, సెప్టెంబర్ 23 : నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఇంద్రవెల్లి రాజేశ్వరి, సతీశ్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మూడేండ్ల క్రితం తండ్రి సతీశ్ అనారోగ్యంతో మృతిచెందడంతో తల్లి రాజేశ్వరి కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను చదివిస్తున్నది.
పెద్ద కుమార్తె హరిణి(18) ఖమ్మం జిల్లా తనికెళ్ల సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నది. ఇటీవల కళాశాలకు సెలవులు ఇవ్వడంతో కొత్తగూడెంలోని పిన్ని ఇంటికి వెళ్లింది. రెండు రోజుల క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చింది. మంగళవారం తల్లి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి కూతురు కనిపించలేదు. ఆందోళనకు గురైన ఆమె పరిసరాల్లో వెతుకగా, బాత్రూమ్ వెనుక భాగంలో హరిణి విగతజీవిగా పడి ఉన్నది. పలుచోట్ల గాయాలు, దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉండటంతో తల్లి తీవ్ర ఆందోళనకు గురైంది. సీఐ శ్రీలక్ష్మి, ఎస్సై జీనత్కుమార్ తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి పలు కోణాల్లో విచారణ చేపడుతున్నారు.
వామపక్ష, విద్యార్థి, మహిళా సంఘాల రాస్తారోకో
హరిణి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జూలూరుపాడులోని పాపకొల్లు క్రాస్ రోడ్డు వద్ద ప్రధాన రహదారిపై బుధవారం వామపక్షాలు, విద్యార్థి, మహిళా, దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాన్వాయ్ రాస్తారోకో సందర్భంగా నిలిచిపోయింది. మంత్రి కారు దిగి ఆందోళనకారులతో మాట్లాడి వారి సమస్యను తెలుసుకొన్నారు. వెంటనే ఎస్పీ రోహిత్ రాజుతో ఫోన్లో మాట్లాడి.. నిందితులను పట్టుకునేందుకు విచారణను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆర్డీవోతో విచారణ చేయించి, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని అధికారులకు సూచించడంతో ఆందోళనకారులు రాస్తారోకోను విరమించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

