సిడ్నీ: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ సూపర్ హిట్టింగ్ చేశాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్ అలెన్ తొలి ఓవర్ నుంచే దూకుడు ప్రదర్శించాడు. అలన్ కేవలం 16 బంతుల్లో 42 రన్స్ చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో మూడు సిక్సర్లు, నాలుగు బౌండరీలు ఉన్నాయి.
తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకున్నది. సూపర్ 12లో భాగంగా ఇవాళ ఆసీస్, కివీస్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అలెన్ దూకుడు ఆటకు కేవలం 3.5 ఓవర్లలోనే కివీస్ 50 పరుగుల మార్క్‌ను దాటింది. కివీస్‌కు మంచి స్టార్ట్ ఇచ్చిన అలెన్ .. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 262.5 స్కోరింగ్ రేటుతో ఫిన్ బ్యాటింగ్ చేశాడు.
తాజా సమాచారం ప్రకారం కివీస్ 8 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 81 రన్స్ చేసింది.