రాయ్‌పూర్ : ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్(IPL 2026)లో ఫైనల్ ఓవర్ ఉత్కంఠంగా సాగింది. ఆఖరి ఓవర్లో గెలుపు కోసం ఆర్సీబికి 15 పరుగులు అవసరం కాగా.. చివరి బంతి వరకు ఫైట్ కొనసాగింది. ఆ ఫైనల్ ఓవర్‌ను బవ బౌలింగ్ చేశాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరం ఉన్న సమయంలో.. ఫీల్డర్ చేసిన పొరపాటు వల్ల ముంబై ఓటమి పాలైంది. నాన్ స్ట్రయికర్ ఎండ్ వైపు ఫీల్డర్ బంతిని విసిరి ఉంటే, ఆ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లేది. కానీ ఫీల్డర్ పొరపాటు వల్ల ఆర్సీబీ ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది.
నిజానికి రాజ్ బవ ఫైనల్ ఓవర్‌ను పేలవంగా స్టార్ట్ చేశాడు. ఓ వైడ్ వేశాడు. ఆ తర్వాత నోబ్ వేశాడు. ఆ ఓవర్లో అతను అయిదు ఎక్స్‌ట్రాలు సమర్పించాడు. అయితే ఆఖరి బాల్‌ను బ్యాటర్ రసిక్‌కు వేశాడు. అతను స్ట్రెయిట్ షాట్ కొట్టాడు. బౌలర్ ఆ బంతిని మిస్‌ఫీల్డ్ చేశాడు. బౌలర్‌కు తాకిన బంతి.. మిడాన్ దిశగా వెళ్లింది. అయితే లాంగ్ ఆన్ వద్ద ఉన్న ఫీల్డర్ బంతిని కలెక్ట్ చేసుకుని, కీపర్ దిశగా విసిరాడు. ఈ లోగో రసిక్ రెండో రన్ పూర్తి చేశాడు. బౌలర్ బవ బంతి వేసిన తర్వాత పిచ్ మధ్యలోనే ఉండిపోయాడు. దీంతో లాంగ్ ఆన్ ఫీల్డర్ .. నాన్‌స్ట్రయికర్ దిశకు బంతిని విసరలేకపోయాడు. ఒకవేళ నాన్‌స్ట్రయికర్ దిశగా విసిరి ఉంటే, బ్యాటర్ ఔటయ్యేవాడు. దాని వల్ల మ్యాచ్ సూపర్ ఓవర్లోకి వెళ్లేది. ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి ఆన్లైన్లో పోస్టు చేశారు.
ముంబై ఇండియన్స్ స్టాండ్ ఇన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. బవకు చివరి ఓవర్‌ను ఇవ్వడాన్ని సమర్ధించుకున్నాడు. యువ క్రికెటర్‌ను నిందించలేమన్నారు. బవ మంచి ఆల్‌రౌండర్ అని, చాలా ప్రాక్టీస్ చేశాడని, జట్టు విజయం కోసం అతను కృషి చేసినట్లు చెప్పాడు. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఔటయ్యింది. లక్నో సూపర్ గెయింట్స్ జట్టు కూడా ప్లే ఆఫ్స్ అర్హత కోల్పోయింది.
A wrong throw at one end, and Mumbai Indians lost the match. At the bowling end, if this fielder had thrown the ball, the batsman could have been easily run out.🥲 pic.twitter.com/Nl8pvGEpcf
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 10, 2026