ఢిల్లీ: ఫిడే చెస్ ప్రపంచకప్‌నకు భారత్ ఆతిథ్యమివ్వబోతున్నది. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్‌లో జరుగనున్న ఈ టోర్నీ భారత్‌లో జరుగుతుందని ఈ మేరకు ఫిడే సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘ప్రతిష్టాత్మక ఫిడే చెస్ ప్రపంచకప్ భారత్‌కు రాబోతుంది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు నిర్వహించనున్న ఈ టోర్నీలో ప్రపంచ అత్యుత్తమ చెస్ ప్లేయర్లు పాల్గొననున్నారు. 2026 ఫిడే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించేందుకు ఈ టోర్నీ ఎంతో కీలకం’ అని ప్రకటనలో పేర్కొంది. భారత్‌లో చెస్ ప్రపంచకప్ జరుగుతుందని ఫిడే ప్రకటించినా.. దానిని ఏ నగరంలో నిర్వహిస్తారనేదానిపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.