దుబాయ్: పాకిస్థాన్ బౌలర్ హరీస్ రౌఫ్ అనుచిత రీతిలో సంకేతాలతో క్రికెట్ అభిమానులు రెచ్చగొట్టిన విషయం తెలిసిందే. ఆసియాకప్‌లో సూపర్ ఫోర్ మ్యాచ్‌లో అతను బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తూ తన చేతి వేళ్లతో 6-0 అని సంకేతం ఇచ్చాడు. ఆ తర్వాత విమానం కూలుతున్నట్లు సంజ్ఞ చేశాడు. బౌండరీ వద్ద ప్రేక్షకులు వేధిస్తున్న సమయంలో రౌఫ్ ఆ సంకేతాలు ఇచ్చాడు. అయితే ఇటీవల ఆపరేషన్ సింధూర్‌లో భారత్‌కు చెందిన యుద్ధ విమానాలు కూలయన్న ఉద్దేశంతో పాక్ బౌలర్ ఆ సంజ్ఞ చేశాడు.
హరీస్ రౌఫ్ చేసిన సంకేతానికి ఇండియన్ బౌలర్ అర్షదీప్ సింగ్(Arshdeep Singh) కౌంటర్ ఇచ్చాడు. ఆ కౌంటర్‌కు చెందిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది. రౌఫ్ చేసిన సంకేతాలకు దీటుగా అర్షదీప్ తన చేతులతో కొన్ని సంజ్ఞలు చేశాడు. ఆ సంకేతాలకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. పాక్ బౌలర్ రౌఫ్‌కు వెటకారంగా అర్షదీప్ కౌంటర్ ఇచ్చాడని ఆన్లైన్ అభిమానులు ప్రశంసిస్తున్నారు.
సూపర్ ఫోర్ మ్యాచ్‌లో రౌఫ్ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న అభిమానులు కోహ్లీ, కోహ్లీ అంటూ అరిచారు. టీ20 వరల్డ్‌కప్‌లో జరిగిన సంఘటనను ప్రేక్షకులు గుర్తు చేస్తూ కేకలు పెట్టారు. దాంతో సహనం కోల్పోయిన రౌఫ్.. సంకేతాలు చేశాడు.
Arshdeep Singh Cooked Haris Rauf and Pakistanis 😂
: Rafael Teri G*nd me 🌚 pic.twitter.com/81bJH09bZI
— Incognito Cricket (@Incognitocric) September 23, 2025