IND vs PAK : ఆసియా కప్ లీగ్ దశలో పాకిస్థాన్‌ను తక్కువకే కట్టడి చేసిన భారత బౌలర్లు సూపర్ 4లో తేలిపోయారు. ప్రధాన పేసర్ బుమ్రా, పాండ్యా.. కుల్దీప్ యాదవ్ విఫలమవ్వగా.. ఫీల్డింగ్‌లోనూ నాలుగు క్యాచ్‌లు జారవిడవడంతో పాక్ బ్యాటర్లు పరుగుల పండుగ చేసుకున్నారు. ఓపెనర్ షహిబ్జద ఫర్హాన్(58) అర్ధ శతకంతో చెలరేగగా.. సయీం ఆయీబ్(21) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే.. శివం దూబే రెండు వికెట్లు తీసి పాక్ జోరుకు కళ్లెం వేశాడు. ఆఖర్లో సల్మాన్ అఘా (17 నాటౌట్) ధనాధన్ ఆడగా పాక్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.
ఆసియాకప్ లీగ్ దశలో భారత బౌలర్లను ఎదుర్కోలేక చాపచుట్టేసిన పాకిస్థాన్ ఈసారి గొప్పగా పోరాడింది. సూపర్ 4 మ్యాచ్‌లో టాస్ ఓడిన పాకిస్థాన్ బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో భారీ స్కోర్ చేసింది. 21 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ఆ తర్వాత పుంజుకుంది. భారత బౌలర్ల, ఫీల్డర్ల వైఫల్యంతో ధనాధన్ ఆడిన సయీం ఆయూబ్ (21), ఓపెనర్ షహిబ్జద ఫర్హాన్ (58) కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. పవర్ ప్లేలో ఇద్దరూ బౌండరీలతో రెచ్చిపోగా వికెట్ నష్టానికి 55 రన్స్ చేసింది పాక్. ఆ తర్వాత కూడా ఈ జోడీ దూకుడు పెంచుతూ పోయింది.
Innings Break!
We’ve been given a target of 172 runs to chase.
Scorecard – https://t.co/XXdOskvd5M #AsiaCup2025 #Super4 pic.twitter.com/e9iphwUVNi
— BCCI (@BCCI) September 21, 2025
కుల్దీప్ వేసిన 9వ ఓవర్లో ఆయూబ్, ఫర్హాన్ చెరొక సిక్సర్‌తో రెచ్చిపోయారు. రెండో వికెట్‌కు 72 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని శివం దూబే విడదీశాడు. అభిషేక్ ఒడిసిపట్టుకున్నాడు. 93 వద్ద రెండో వికెట్ పడింది. కాసేపటికే కుల్దీప్ ఓవర్లో రివర్స్ స్వీప్ ఆడి వరుణ్ చక్రవర్తి చేతికి చిక్కాడు హుస్సేన్. దూబే బౌలింగ్‌లో పెద్ద ఆడబోయిన ఫర్హాన్ .. సైతం ఔట్ కాగా పాక్ స్కోర్ వేగం తగ్గింది. కానీ దూబే వేసిన 18వ ఓవర్లో నవాజ్ ఒక సిక్స్, ఫోర్ బాది స్కోర్ 140 దాటించాడు. చివరి రెండు ఓవర్లలో దంచేసిన ఫహీం(20 నాటౌట్) 25 పరుగులు పిండుకున్నాడు. దాంతో, పాక్ నిర్ణీత ఓవర్లలో 171 రన్స్ చేయగలిగింది.