Arshdeep Singh : భారత క్రికెట్లో కొన్నిసార్లు ప్రతిభావంతులకు అవకాశాలు రాకపోవడం కొత్తేమీ కాదు. గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) కూడా ఒక బాధితుడే. ఆసియా కప్‌లో.. అంతకుముందు టీ20 ప్రపంచకప్‌లో గొప్పగా రాణించినా ఈ పంజాబీ పేసర్‌ను పొట్టి ఫార్మాట్‌కే పరిమితం చేస్తున్నారు కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir), కెప్టెన్ శుభ్‌మన్ గిల్. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో రెండు మ్యాచ్‌లకు అర్ష్‌దీప్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంపై విమర్శలు రావడంతో ఎట్టకేలకు ఇండోర్ వన్డేలో అవకాశమిచ్చారు. వైట్‌బాల్ క్రికెట్లో తానెంత ప్రమాదకరమో చాటుతూ మూడు వికెట్లతో మెరిశాడీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్.
జస్ప్రీత్ బుమ్రా తర్వాత టీమిండియాకు అత్యుత్తమ వైట్‌బాల్ బౌలర్ అర్ష్‌దీప్ సింగే. అవును.. కొత్త బంతితో నిప్పులు చెరిగే ఈ పేసర్ టీ20ల్లో బుమ్రా కంటే ముందే వంద వికెట్ల క్లబ్లో చేరాడు. అలాంటిది అతడిని కోచ్ గంభీర్ పదే పదే బెంచ్‌కే పరిమితం చేస్తున్నాడు. హర్షిత్ రానాను వన్డే ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దాలని వరుసగా అవకాలిస్తున్నాడు. బుమ్రా గైర్హాజరీలో అర్ష్‌దీప్‌ను ఆడించకుండా ప్రసిధ్ కృష్ణ (Prasidh Krishna)ను ఆడిస్తున్నాడు. కానీ, రెండు మ్యాచుల్లో మూడు వికెట్లే తీసిన ప్రసిధ్ మెప్పించలేకపోయాడు. దాంతో.. మళ్లీ అర్ష్‌దీప్ వైపు చూడాల్సి వచ్చింది.
How dumb Gautam Gambhir is, how someone can select Prasidh Krishna ahead of Arshdeep Singh.
Arshdeep Singh can perform 8/10 matches but when it comes to run machine he will perform 10/10 for opposition.pic.twitter.com/IogDVRGUPU
— Sujeet Suman (@sujeetsuman1991) January 18, 2026
ఇండోర్ వన్డేలో తొలి ఓవర్లోనే ఓపెనర్ హెన్రీ నికోల్స్(0)ను బౌల్డ్ చేసి తన ఎంపిక సరైందేనని నిరూపించాడీ స్పీడ్‌స్టర్. సెంచరీతో చెలరేగిన గ్లెన్ ఫిలిప్స్(106)ను, జకరీ ఫౌల్క్స్(10)ను వెనక్కి పంపి న్యూజిలాండ్ స్కోర్ వేగానికి బ్రేకులు వేశాడీ పేస్ గన్. దాంతో.. వజ్రాన్ని వదిలేసి ప్రసిధ్ కృష్ణను సానబెట్టాలని చూస్తారా? అని నెటిజన్లు హెడ్‌కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను విమర్శిస్తున్నారు. స్వదేశంలో ఫిబ్రవరి 7 నుంచి మొదలయ్యే పొట్టి ప్రపంచకప్‌లో, వచ్చే వన్డే వరల్డ్‌కప్‌లో అర్ష్‌దీప్ భారత విజయాల్లో కీలకమవుతాడని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
Arshdeep Singh has always been a wicket taker for India in every format.
Still Gautam Gambhir used to bench him in most of the games. Jasprit Bumrah and Arshdeep will be the key in the T20 World Cup and the 2027 WC if Gambhir does not play politics 🔥🙇pic.twitter.com/tBcjoU9R2v
— Tejash (@Tejashyyyyy) January 18, 2026