పారిస్: టెన్నిస్ స్టార్, స్పెయిన్ బుల్ రఫేల్ నడాల్ సోమవారం చేసిన ఓ ఫేస్బుక్ అప్డేట్ అతని అభిమానులు అయోమయానికి గురి చేసింది. గాట్ మ్యారీడ్ అంటూ రఫా తన ప్రొఫైల్ అప్డేట్ చేశాడు. ఇది చూసి కొందరు ఫ్యాన్స్ ఆనందపడగా.. మరికొందరు మాత్రం అతను ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఏంటి.. 2019లోనే నడాల్ ఓ ఇంటి వాడయ్యాడు కదా అని ఆశ్చర్యపోయారు. నిజానికి రఫా 2019, అక్టోబర్‌లోనే తన ప్రేయసి పెరెలోను పెళ్లి చేసుకున్నాడు.
కానీ ఫేస్‌బుక్‌ను తాజాగా అప్డేట్ చేయడంతో అది కాస్తా అతడు ఆదివారమే పెళ్లి చేసుకున్నట్లుగా చూపించింది. ఈ సందర్భంగా చాలా మంది అతనికి కంగ్రాట్స్ చెబుతూనే.. మీరు 2019లోనే పెళ్లి చేసుకున్నారుగా అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతున్న నడాల్.. నాలుగో రౌండ్లోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే.