మథురాపూర్: కేంద్ర మంత్రి అమిత్ షాకు బెంగాల్లోని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ సవాల్ విసిరారు. మంగళవారం మథురాపూర్ ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గం నుంచి తనపై పోటీ చేయాలని, ఒక వేళ షా నెగ్గితే తాను రాజకీయాల నుంచి వైదొలగుతానని ఛాలెంజ్ చేశారు.
రాష్ర్టానికి రావాల్సిన బకాయిలు విడుదల చేసినా రాజకీయాల నుంచి రిటైరవుతానని అన్నారు.