IPL 2023 | అర్ధ శతకాలు బాదిన డూప్లెసిస్, మ్యాక్స్‌వెల్.. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్
చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు దంచికొట్టారు. కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(62), గ్లెన్ మ్యాక్స్‌వెల్(77) అర్థ శతకంతో చెలరేగారు. దాంతో, ఆర్సీబీ9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్ రెండేసి వికెట్లు తీశారు. అశ్విన్, చాహల్‌కు ఒక్కో వికెట్ దక్కింది.
IPL 2023: చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు దంచికొట్టారు. కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(62), గ్లెన్ మ్యాక్స్‌వెల్(77) అర్థ శతకంతో చెలరేగారు. దాంతో, ఆర్సీబీ9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ తొలి బంతికే డకౌటయ్యాడు. ఆ తర్వాత డూప్లెసిస్, మ్యాక్స్‌వెల్ వేగంగా ఆడారు. 11 ఓవర్లకు స్కోర్ వంద దాటించారు. హాఫ్ సెంచరీ తర్వాత జోరు పెంచిన వీళ్లిద్దరు వెంట వెంటనే ఔటయ్యారు. ఆ తర్వాత ఆర్సీబీ పరుగుల వేగం తగ్గింది. చివర్లో దినేశ్ కార్తిక్(16), మహిపాల్ లొమ్రోర్(8), వనిందు హసరంగ(6) ధాటిగా ఆడడంతో 180 ప్లస్ చేయగలిగింది.
Despite the early wickets, @RCBTweets with a successful powerplay!
FIFTY partnership up in no time between @faf1307 & @Gmaxi_32 🤝
Follow the match ▶️ https://t.co/lHmH28JwFm#TATAIPL | #RCBvRR pic.twitter.com/Zz0O4UKy3n
— IndianPremierLeague (@IPL) April 23, 2023
సందీప్ శర్మ వేసిన 20వ ఓవర్లో దినేశ్ కార్తిక్(16) ఔటయ్యాడు. మొదటి బంతికి ఫోర్ కొట్టిన అతను రెండో బంతికి షాట్ ఆడాడు. బౌండరీ వద్ద బట్లర్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. ఆ తర్వాత బంతికే విజయ్ కుమార్ ఔటయ్యాడు. ఐదో బంతికి డేవిడ్ విల్లే రివర్స్ స్కూప్‌తో బౌండరీ కొట్టాడు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్ రెండేసి వికెట్లు తీశారు. అశ్విన్, చాహల్‌కు ఒక్కో వికెట్ దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

