Fabian Allen : దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ఊహించని సంఘటన జరిగింది. పార్ల్ రాయల్స్ జట్టుకు ఆడుతున్న వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఫాబియన్ అల్లెన్(Fabian Allen) పెద్ద ప్రమాదం తప్పింది. జొహన్నెస్‌బర్గ్‌లోని సాండ్టన్ సన్ హోటల్(Sandton Sun Hotel) బయట కొందరు దుండగులు అలెన్‌ను నిలువు దోపిడీ చేశారు. తుపాకులతో బెదిరించి అతడి ఫోన్, బ్యాగ్‌తో పాటు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. అయితే.. ఈ సంఘటనలో విండీస్ ఆల్‌రౌండర్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ విషయం వెలుగులోకి రావడంతో కరబీయన్ బోర్డు తమ ఆటగాళ్ల భద్రతపై అందోళన వ్యక్తం చేసింది.
‘మా హెడ్‌కోచ్ ఆడ్రే కొలే(Andre Coley)ది కూడా జమైకానే. అలెన్‌పై దాడి విషయం తెలియగానే అతడు వెంటనే వెస్టిండీస్ బౌలర్ ఒబెడ్ మెక్కాయ్(Obed McCoy) సాయంతో అతడిని కలిశాడు.
ఫాబియన్ అల్లెన్
ప్రస్తుతం అలెన్ బాగానే ఉన్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్, పార్ల్ రాయల్స్ టీమ్ వెల్లడించే అవకాశం ఉంది’ అని వెస్టిండీస్ క్రికెట్ అధికారి ఒకరు క్రిక్‌బజ్‌తో తెలిపారు.
దక్షిణాఫ్రికా టీ20 లీగ్ రెండో సీజన్లో అలెన్ పెద్దగా రాణించింది లేదు. 38 రన్స్ చేసి 2 వికెట్లు తీశాడంతే. రాయల్స్ జట్టు 10 మ్యాచుల్లో 4 విజయాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఐపీఎల్‌నూ ఆడిన అలెన్ అంచనాలను అందుకోలేకపోయాడు. 2022 మినీ వేలంలో అలెన్‌ను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కొన్నది. రూ. 70 లక్షలు పలికిన ఈ యంగ్‌స్టర్ ఐదు మ్యాచుల్లో 7.0 సగటుతో 14 రన్స్‌తో నిరాశపరిచాడు.