బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Oct 14, 2020 , 22:39:55

DC vs RR: పోరాడుతున్న రాజస్థాన్‌

DC vs RR: పోరాడుతున్న రాజస్థాన్‌

దుబాయ్:‌  ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌ రాయల్స్‌  పోరాడుతోంది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌ 97 పరుగులకే 4 వికెట్లకు కోల్పోయింది.  అంతకుముందు అక్షర్‌ పటేల్‌ వేసిన ఇన్నింగ్స్‌  9వ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి.  లక్ష్యం దిశగా సాగుతున్న రాజస్థాన్‌ను తుషార్‌ దెబ్బతీశాడు.బెన్‌ స్టోక్స్‌(41)ను ఔట్‌ చేసి  రాజస్థాన్‌ను ఒత్తిడిలో పడేశాడు.  14 ఓవర్లకు రాజస్థాన్‌ 5 వికెట్లకు 115 పరుగులు చేసింది. ప్రస్తుతం ఉతప్ప(23), రాహుల్‌ తెవాటియా(0) క్రీజులో ఉన్నారు.  రాజస్థాన్‌ విజయానికి ఇంకా 36 బంతుల్లో 47 పరుగులు కావాల్సి ఉంది.