Ian Chappell | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)ను ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభివర్ణించారు. ఆర్థికంగా బలంగా ఉన్న బోర్డులే తమ సొంత కార్యక్రమాలను సిద్ధం చేసుకుంటున్నాయని.. ఇది టెస్ట్ క్రికెట్ ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని ఆరోపించారు. టెస్ట్ క్రికెట్ కోసం టైర్ టూ సిస్టమ్‌ను ఇప్పటికే అమలు చేయాల్సిందన్నారు. ఈఎస్పీఎన్కు కాలామ్స్ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో సంక్లిష్టమైన సమస్య ఉందని.. ఐసీసీ క్రికెట్‌ను నడపలేదని.. మనసు మారకపోతే ఆర్థికంగా బలమైన దేశాలు సెల్ఫ్-సర్వీస్ షెడ్యూల్‌ను రూపొందించడంలో ప్రముఖ పాత్రను కలిగి ఉంటాయన్నారు. అయితే, క్రికెట్లో భారత ప్రభావం, సహకారం అసమానంగా ఉందని చాపెల్ పేర్కొన్నారు. ప్రధాన సమస్య ఆర్థిక విభజేనని.. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ధనిక దేశాలని.. క్రికెట్ సంస్థలకు పంచిన డబ్బులో ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయన్నారు.
టెస్ట్ క్రికెట్‌ను రెండు విభాగాలుగా విభజించి.. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి పెద్ద జట్లు ఎక్కువ ప్రాధాన్యమున్న మ్యాచులు ఆడేలా చేయాలనే ప్రతిపాదన జరుగుతుందని.. ఏదేమైనా ఈ వ్యవస్థ చిన్న జట్లకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయన్నారు. ఫలితంగా చిన్న జట్లకు టెస్టులు తక్కువగా ఆడే అవకాశం ఉందని.. ఇది ఆటకు ప్రమాదం కలిగిస్తుందన్నారు. అలాగే, పలు ప్రమాణాలతో పదోన్నతి, బహిష్కరణ వ్యవస్థలు సైతం అమలు చేయాలన్నారు. వాస్తవానికి పరిమిత సంఖ్యలోనే జట్లు ఐదు రోజుల పాటు పోటీపడే సామర్థ్యం కలిగి ఉన్నాయన్నారు. అఫ్గానిస్తాన్, ఐర్లాండ్ అన్ని అవసరాలను తీర్చనందున టెస్ట్ క్రికెట్‌ను నిర్వహించకూడదని చాపెల్ అన్నారు. ప్రమోషన్, బహిష్కరణతో కూడిన వ్యవస్థ సాధ్యమే, కానీ జట్టు టెస్ట్ హోదా పొందాలంటే కొన్ని ప్రమాణాలు అవసరమన్నారు. ఆయా జట్లకు ఫస్ట్ క్లాస్ టోర్నమెంట్స్ ఉన్నాయా? ఐదు రోజుల మ్యాచులను నిర్వహించేందుకు మైదానాలు ఉన్నాయా? సరైన సౌకర్యాలు ఉన్నాయా? ఆర్థికంగా స్థిరంగా ఉన్నాయా? చూడాలన్నారు.
ఒక జట్టు అన్ని ప్రమాణాలు ఉంటే ఉన్నత స్థాయి ఆటను కొనసాగిస్తే టెస్ట్ క్రికెట్ హోదా మంజూరు చేయడం చట్టబద్ధమైందన్నారు. ఇటీవల చాలా దేశాలు ఏ సహేతుకమైన ప్రమాణాలను చేరుకోలేవన్నారు. సమస్యాత్మకమైన ఆఫ్ఘనిస్తాన్ తమ దేశంలో టెస్ట్‌లను నిర్వహించగలదా? ఆ దేశానికి టెస్ట్ హోదా ఎందుకు అని ప్రశ్నించారు. ఐర్లాండ్‌లో టెస్టులు నిర్వహించేందుకు మైదానాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. చిన్న క్రికెట్ ఆడే దేశాలు స్వదేశంలో ఫస్ట్ క్లాస్ మ్యాచులు నిర్వహించడం అంత సులభమైన విషయం కాదన్నారు. దీనికి ఎంతో ఖర్చు అవుతుందన్నారు. టీ20 క్యాలెండర్ ప్రస్తుత షెడ్యూల్లో ఆటను ప్రభావితం చేస్తుందన్నారు. ఎంసీజీలో భారత్‌తో సామ్ కాన్స్టాస్ టెస్టు అరంగేట్రాన్ని ఉదాహారణ అని పేర్కొన్నారు. టెస్ట్ చూడడానికి వచ్చే అభిమానులు మరిన్ని టీ20 స్టయిల్ షాట్స్ చూడాలని ఆశించే స్థాయికి చేరుకుంటుందన్నారు. ఎంసీజీలో కాన్స్టాస్ ఇన్నింగ్స్‌కు వచ్చిన ప్రతిచర్యలు ఇది ఇప్పటికే జరుగుతున్నట్లుగా చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.