Euro 2024 : ప్రపంచమంతా క్రికెట్ వరల్డ్ కప్ మజాను ఆస్వాదిస్తున్న వేళ ఫుట్‌బాల్ పండుగకు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో నాలుగు రోజుల్లో జర్మనీ(Germany) వేదికగా ప్రతిష్ఠాత్మక యూరో చాంపియన్‌షిప్(Euro 2024) షురూ కానుంది. జూన్ 15న జరిగే స్కాట్లాండ్(Scotland)తో ఆతిథ్య దేశం, మ్యాచ్‌తో సాకర్ సంబురం అభిమానులను అలరించనుంది.
ఈసారి మెగా టోర్నీకి 51 యూరోపియన్ దేశాలు అర్హత సాధించాయి. టోర్నీకి సమయం దగ్గరపడడంతో స్టార్ ఆటగాళ్లంతా తమ మ్యాజిక్ చూపించేందుకు సిద్ధమవుతున్నారు. మైదానల్లో గోల్స్ వర్షాన్ని ఆస్వాదించేందుకు అభిమానులు సైతం రెడీ అంటున్నారు.
Ready for EURO 2024! 🤩#EURO2024 pic.twitter.com/Fb7WEdgJff
— UEFA EURO 2024 (@EURO2024) March 26, 2024
జర్మనీలో ఈ మధ్య కాలంలో జరుగుతున్న అతిపెద్ద టోర్నీ ఇదే. నెల రోజుల పాటు ఉత్కంఠ పోరాటాలతో జోరుగా సాగే చాంపియన్‌షిప్‌ను 10 స్టేడియాల్లో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. వాటిలో బెర్లిన్‌లోని ఒలింపియా స్టేడియం, మ్యూనిచ్‌లోని అలియంజ్ అరెనా(Allianz Arena) మైదానాలు ముఖ్యమైనవి. యూరో చాంపియన్‌షిప్‌లో ఇటలీ(Italy) డిఫెండింగ్ చాంపియన్‌గా అడుగుపెట్టనుంది. 2020లో ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో ఇటలీ ఫ పెనాల్టీలతో జయభేరి మోగించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.