Esha Gupta | క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో రిలేషన్‌పై బాలీవుడ్ నటి ఈషా గుప్తా క్లారిటీ ఇచ్చింది. ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా సిద్ధార్థ్ కన్నన్ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈషా గుప్తా తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతూ స్పష్టతనిచ్చింది. కొంతకాలం ఇద్దరం మాట్లాడుకున్నామని.. కానీ, డేటింగ్ చేస్తున్నట్లు అనుకోలేదని చెప్పింది. కొద్దినెలల పాటు మధ్య మాటలు సాగాయని.. బహుశా ఇది జరుగుతుందేమో, జరగదేమో అన్న దశలో ఉండేవాళ్లమని.. మేం డేటింగ్ దశకు చేరుకోకముందే అది ముగిసిపోయిందని చెప్పారు. దాన్ని డేటింగ్ చెప్పలేమని.. ఒకట్రెండు సార్లు కలిశామని.. ముందే చెప్పినట్లుగా.. కొన్ని నెలల పాటు మాట్లాడుకున్నామని.. ఆ తర్వాత అది ఆగిపోయిందని వివరించారు.
నిజంగానే వారిద్దరి మధ్య సంబంధం ఏర్పడే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ఈశా స్పందిస్తూ.. బహుశా జరిగి ఉండేదేమోనని.. అనుకున్నంత వేగంగా విషయాలు ముందుకు సాగలేదని చెప్పారు. సమయం, సందర్భం సరిగ్గా కుదరలేదని ఆమె పంచుకున్నారు. ఇద్దరి మధ్యలు ఎలాంటి గొడవలు జరుగలేదని.. మనస్పర్థలు సైతం రాలేదని.. అలా జరగాలని రాసిపెట్టలేదంటే అంటూ వ్యాఖ్యానించారు. అయితే, కాఫీ విత్ కరణ్ హార్దిక్ పాండ్యా సంలచన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాఫీ విత్ కరణ్’ లో షోలో హార్దిక్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపించలేదని కూడా స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. ఈషా గుప్తా కెరీర్ విషయానికొస్తే.. ఈశా బాబీ డియోల్‌తో ఎంఎక్స్ ప్లేయర్ వెబ్ సిరీలో నటించింది. ఏక్ బద్నామ్ ఆశ్రమ్-3 పార్ట్ 2లో కనిపించింది. వన్ డే: జస్టిస్ డెలివర్డ్ మూవీలో డీసీపీ లక్ష్మిరాఠి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆమె ‘హేరా ఫేరీ 3’ మూవీలో నటిస్తున్నట్లు సమాచారం.