కొలంబో: శ్రీలంక పర్యటనలో ఉన్న ఇంగ్లండ్.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకుంది. ఇరుజట్ల మధ్య కొలంబోలో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో మొదట బ్యా టింగ్ చేసిన ఇంగ్లండ్.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (66 బంతుల్లో 136 నాటౌట్, 11 ఫోర్లు, 9 సిక్స్‌లు) వీరవిహారానికి తోడు జో రూట్ (108 బంతుల్లో 111) సెంచరీలతో నిర్ణీత ఓవర్లలో 357/3 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఛేదనలో లంకేయులు పోరాడినా ఆ జట్టు 46.4 ఓవర్లలో 304 రన్స్ వద్దే ఆగిపోయింది. పవన్ రత్నయాకె (121), పతుమ్ నిస్సంక (50) పోరాడారు. తొలి వన్డేలో లంక గెలువగా తర్వాత రెండు వన్డేలూ ఇంగ్లండ్ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది.