మాంచెస్టర్: జానీ బెయిర్‌స్టో (86 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), హ్యారీ బ్రూక్ (67; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో న్యూజిలాండ్‌పై వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్‌నే విజయం వరించింది. మొదట ఇంగ్లండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 198 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో సోధి 2 వికెట్లు పడగొట్టాడు.
లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 13.5 ఓవర్లలో 103 పరుగులకే పరిమితమైంది. సీఫర్ట్ (39) టాప్ స్కోరర్ కాగా.. ఇంగ్లిష్ బౌలర్లలో అకిన్సన్ 4 వికెట్లు పడగొట్టాడు. బెయిర్‌స్టోకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్ల మధ్య ఆదివారం మూడో మ్యాచ్ జరుగనుంది.