కొలంబో: మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ వరుస విజయాలతో దుమ్మురేపుతున్నది. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 254 పరుగుల లక్ష్యఛేదనలో లంక 45.4 ఓవర్లలో 164 పరుగులకు కుప్పకూలింది. సోఫీ ఎకల్‌స్టోన్(4/17) ధాటికి లంక బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు.
ఓపెనర్ హసిని పెరెరా(35), హర్షిత సమరవిక్రమ(33) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. తొలుత కెప్టెన్ నాట్‌సీవర్(117 బంతుల్లో 117, 9ఫోర్లు, 2సిక్స్‌లు) సూపర్ సెంచరీతో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 253/9 స్కోరు చేసింది. 109 పరుగులకే అమీ జోన్స్(11), బూమౌంట్(32), హీథర్ నైట్(29) స్వల్ప స్కోర్లకే వెనుదిరుగగా, నాట్ సీవర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో కదంతొక్కింది.