లండన్: శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా దూసుకెళుతున్నది. తాత్కాలిక కెప్టెన్ ఒలీ పోప్(103 బంతుల్లో 103 నాటౌట్) సెంచరీకి తోడు డకెట్ (86) అర్ధసెంచరీతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 221/3 స్కోరు చేసింది.
లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ పోప్.. దూకుడుగా ఆడాడు. తన ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, రెండు సిక్స్‌లతో చెలరేగాడు. పోప్‌తో పాటు బ్రూక్ (8) క్రీజులో ఉన్నాడు.