మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Sep 04, 2020 , 17:14:56

ఆసీస్‌తో తొలి టీ20..ఇంగ్లాండ్‌ ఓపెనర్‌గా జోస్‌ బట్లర్‌!

ఆసీస్‌తో తొలి టీ20..ఇంగ్లాండ్‌  ఓపెనర్‌గా జోస్‌ బట్లర్‌!

సౌతాంప్టన్‌: ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మధ్య మరికాసేపట్లో ఆసక్తికర సమరం జరగనుంది. మూడు మ్యాచ్‌ల  సిరీస్‌లో తొలి టీ20 శుక్రవారం రాత్రి 10:30 గంటలకు  ఆరంభంకానుంది.  ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ ఓపెనర్‌గా జోస్‌ బట్లర్‌ బరిలో దిగనున్నట్లు ఆ జట్టు కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ఇప్పటికే  ధ్రువీకరించాడు.  మరో ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టోతో  కలిసి బట్లర్‌ ఇన్నింగ్స్‌ ఆరంభిస్తాడని మోర్గాన్‌ పేర్కొన్నాడు. ఇద్దరు కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు.

డేవిడ్‌ మలన్‌ మూడో స్థానంలో  బరిలో దిగనుండగా  ఇయాన్‌ మోర్గాన్‌, సామ్‌ బిల్లింగ్స్‌, మొయిన్‌ అలీ తర్వాత బ్యాటింగ్‌కు రానున్నారు.  మరోవైపు ఆస్ట్రేలియా జట్టుకు అరోన్‌ ఫించ్‌ నాయకత్వం వహిస్తుండగా డేవిడ్‌ వార్నర్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోదిగనున్నాడు. స్టీవ్‌ స్మిత్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, అలెక్స్‌ కేరీ, మిచెల్‌ మార్ష్‌  బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుగా వచ్చే అవకాశం ఉంది. కంగారూలు  తమ చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ని గత మార్చిలో  ఆడారు.


logo