CWC | న్యూఢిల్లీ: ఫేవరెట్‌గా వన్డే ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ జట్టు.. ఆదివారం అఫ్గానిస్థాన్‌తో అమీతుమీకి సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన అనంతరం తిరిగి పుంజుకొని బంగ్లాదేశ్‌ను చిత్తుచేసిన ఇంగ్లిష్ టీమ్.. అఫ్గాన్‌పై అదే జోరు కొనసాగించాలని చూస్తున్నది.
మరోవైపు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన అఫ్గానిస్థాన్.. బట్లర్ సేనకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నది. 2019 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గాన్‌తో జరిగిన పోరులో ఇంగ్లండ్ బ్యాటర్లు వీరబాదుడు బాది రికార్డులు బద్దలు కొట్టగా.. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవాలని కాబూలీలు తహతహలాడుతున్నారు.