లార్డ్స్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇవాళ్టి నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతున్నది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అయితే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు పెద్దగా మార్పులేమీ చేయలేదు. చిన్న మార్పులు మినహా దాదాపు తొలి టెస్టు ఆడిన ఆటగాళ్లతోనే రెండో టెస్టు బరిలో దిగాయి.
ఇంగ్లండ్ జట్టు ఫాస్ట్ బౌలర్ జోష్ టంగ్ స్థానంలో ఆల్‌రౌండర్ మొయిన్ అలీకి తుది జట్టులో స్థానం కల్పించింది. అదేవిధంగా ఆస్ట్రేలియా జట్టు కూడా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ స్థానంలో స్కాట్ బోలాండ్‌ను తుది జట్టులోకి తీసుకుంది.