గువాహటి: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో టైటిల్ ఫెవరేట్లలో ఒకటైన ఇంగ్లండ్ ఘన విజయంతో బోణీ కొట్టింది. శుక్రవారం పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో(215 బంతులు మిగిలుండానే) భారీ గెలుపు అందుకుంది. తొలుత లిన్సె స్మిత్ (3/7), నాట్‌సీవర్ (2/5), డీన్ (2/14), ఎకల్‌స్టోన్ (2/19) ధాటికి సఫారీలు 20.4 ఓవర్లలో 69 పరుగులకే కుప్పకూలింది.
ఇంగ్లండ్ బౌలింగ్ ధాటికి దక్షిణాఫ్రికా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. జట్టులో సినాలో జాఫ్టా (22) మినహా ఎవరూ డబుల్ డిజిట్ స్కోర్ అందుకోలేకపోయారు. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ 14.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 73 పరుగులు చేసింది. అమీ జోన్స్(40), బూమౌంట్(21)నాటౌట్‌గా నిలిచారు. స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.