ICC Rankings: భారత పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టు ఇటీవలే హైదరాబాద్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో 29 పరుగుల తేడాతో విజయం సాధించగా ఈ మ్యాచ్‌లో నాలుగు పరుగుల తేడా (196)తో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్న ఇంగ్లీష్ స్టార్ బ్యాటర్ ఒలీ పోప్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపాడు. హైదరాబాద్ టెస్టుకు ముందు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 35వ స్థానంలో ఉన్న పోప్.. 20 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకుకు చేరుకున్నాడు. పోప్‌కు కెరీర్లో ఇదే బెస్ట్ ర్యాంకు కావడం గమనార్హం. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో కివీస్ దిగ్గజ బ్యాటర్ కేన్ విలియమ్సన్.. నెంబర్ వన్ స్థానాన్ని నిలుపుకున్నాడు.
కేన్ మామ తర్వాత ఇంగ్లండ్‌కే చెందిన జో రూట్, ఆసీస్ వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌లు రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. కివీస్ మిడిలార్డర్ బ్యాటర్ డారెల్ మిచెల్ నాలుగో స్థానంలో ఉండగా పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ ఐదు స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరాడు. ఆరో స్థానంలో టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఉన్నాడు. టాప్ -10లో కోహ్లీ మినహా మరెవరూ భారత బ్యాటర్లు లేరు. టీమిండియా సారథి రోహిత్ శర్మ 12వ ర్యాంకులో ఉండగా రిషభ్ పంత్ 13వ స్థానంలో ఉన్నాడు.
Ollie Pope is playing one of his finest Test knocks! #INDvENG pic.twitter.com/4W1qVYc7RT
— Cricbuzz (@cricbuzz) January 27, 2024
టెస్టు బౌలర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్.. 853 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. సఫారీ పేసర్ కగిసొ రబాడా రెండో స్థానంలో ఉండగా ఆసీస్ సారథి పాట్ కమిన్స్ థర్డ్ ప్లేస్ దక్కించుకున్నాడు. భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా నాలుగో స్థానంలో ఉండగా స్పిన్నర్ రవీంద్ర జడేజా ఆరో స్థానంలో నిఇచాడు. టెస్టు ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా 425 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా 328 పాయింట్లతో రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. అక్షర్ పటేల్ ఆరో స్థానంలో నిలిచాడు. టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా, భారత్‌లు తలా 117 పాయింట్లతో సమానంగా ఉన్నా ఆసీస్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. భారత్ రెండో స్థానంలో ఉంది. 115 పాయింట్లతో ఇంగ్లండ్ మూడో స్థానంలో ఉంది. వన్డే, టీ20లలో మాత్రం భారత్‌దే అగ్రస్థానం.
– No.3 in ODIs.
– No.6 in Tests.– Virat Kohli is the Only Indian batter to be part of Both ICC Test and ODI Batting rankings. 🐐 pic.twitter.com/52n3zywbMQ
— CricketMAN2 (@ImTanujSingh) January 31, 2024