Team India Vs England | టీం ఇండియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 25 ఓవర్లు ముగిసే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. లియాం లివింగ్ స్టోన్ కాస్త దూకుడుగా ఆడుతున్నాడు. యుజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో ఒక సిక్సర్, బుమ్రా బౌలింగ్‌లో ఫోర్‌తో అలరించాడు. టీం ఇండియా బౌలర్లు పొదుపుగా బంతులేస్తున్నా.. లియామ్ లివింగ్ స్టోన్ కూడా జాగ్రత్తగా డుతున్నాడు. లివింగ్ స్టోన్తోపాటు ప్రస్తుతం క్రీజ్‌లో మోన్ అలీ ఉన్నారు.
అంతకుముందు యుజువేంద్ర చాహల్ చెలరేగిపోయాడు. ఇంగ్లండ్‌కు చెందిన మూడు వికెట్లు తీశాడు. దీంతో 22వ ఓవర్లో చాహల్ వేసిన స్ట్రెయిట్ బంతిని ఆడబోయిన బెన్ స్టోక్ ఎల్బీడబ్ల్యూ అయి పెవిలియన్ బాట పట్టాడు. అంతకుముందు జోరూట్‌ను ఎల్బీ డబ్ల్యూ చేయగా, ఓపెనర్ జానీ బెయిర్స్టోనూ బౌల్డ్ చేశాడు. 22 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది ఇంగ్లండ్. ప్రస్తుతం క్రీజ్‌లో లియాం లివింగ్ స్టోన్, మోయిన్ ఆలీ ఉన్నారు. అంతకుముందు 20 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 99 పరుగులు చేసింది.