Team India Vs England | టీం ఇండియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు ఒక ఓవర్ మిగిలి ఉండగానే 246 పరుగులకు ఆలౌట్ అయింది. 49వ ఓవర్లో బుమ్రా వేసిన బంతికి టోప్లే క్లీన్‌బౌల్డ్ అవడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో టీం ఇండియా ముందు 247 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.
ఇంగ్లండ్ బ్యాట్స్మన్ల ఆట కట్టించడంలో టీం ఇండియా బౌలర్ యుజువేంద్ర చాహల్ కీలకంగా వ్యవహరించాడు. పది ఓవర్లలో 47 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు దొరకబట్టుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, హార్థిక్ పాండ్యా చెరో రెండు, మహ్మద్ షమీ, ప్రసీద కృష్ణ చెరో వికెట్ తీసుకున్నారు.
ఇంగ్లండ్ బ్యాట్స్మన్లలో మూన్ అలీ 47 పరుగులు చేశాడు. 81 బంతుల్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో అలరించిన మూల్ అని యుజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. మూన్ అలీ తర్వాత మెరుగ్గా ఆడిన డేవిడ్ విల్లే 41 పరుగులు చేశాడు.
జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఎస్ఎస్ అయ్యర్‌కు డేవిడ్ విల్లే క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు తిరిగాడు. కీలక దశలో కొద్దిసేపు నిలదొక్కుకున్న లియాం లివింగ్ స్టన్ 33 పరుగులతో మెరుగైన ఆటతీరే ప్రదర్శించాడు. ఓపెనర్లు జానీ బెయిర్ స్టో 38, జాసన్ రాయ్ 23, బెన్ స్టోక్స్ 21 పరుగులతో ఫర్వాలేదనిపించారు.