ECB : ఓల్ట్ ట్రఫోర్డ్ టెస్టులో జయభేరి మోగించిన ఇంగ్లండ్(England) సిరీస్‌పై కన్నేసింది. ఆగస్టు 29న మొదలయ్యే రెండో టెస్టులో విజయమే లక్ష్యంగా ఓలీ పోప్ సేన బరిలోకి దిగనుంది. అందుకని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 11 మందితో కూడిన తుది స్క్వాడ్‌ను ప్రకటించింది. తొలి టెస్టు సమయంలో గాయపడిన పేసర్ మార్క్ వుడ్(Mark Wood) స్థానంలో స్పీడ్‌స్టర్ ఓలీ స్టోన్(Olly Stone)ను సెలెక్టర్లు ఎంపిక చేశారు.
మూడేండ్ల నిరీక్షణ తర్వాత స్టోన్ మళ్లీ ఇంగ్లండ్ తరఫున తొలి టెస్టు ఆడనున్నాడు. అతడు చివరిసారిగా 2021 జూన్‌లో టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇప్పటివరకూ ఇంగ్లండ్ తరఫున స్టోన్ మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. 19.40 సగటుతో 10 వికెట్లు పడగొట్టాడు.
🔄 We’ve made one change from Old Trafford…
Welcome, Olly Stone 🤝
— England Cricket (@englandcricket) August 27, 2024
ఇంగ్లండ్ తుది జట్టు : బెన్ డకెట్, డాన్ లారెన్స్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మాథ్యూ పాట్స్, ఓలీ స్టోన్, షోయబ్ బషీర్.
తొలి టెస్టులో గాయపడిన ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ (Mark Wood) సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దాంతో, అతడి స్థానంలో మొదట లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జోష్ హల్(Josh Hull)ను ఇంగ్లండ్ సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే.. మరో రెండు రోజుల్లో లార్డ్స్‌లో రెండో టెస్టు మ్యాచ్ అనగా అనూహ్యంగా ఓలీ స్టోన్ పేరు తెరపైకి వచ్చింది.