వరల్డ్ కప్‌లో వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనింగ్ బౌలర్ రిసే టాప్లే గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. మెరుగైన చికిత్స కోసం ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌ను స్వదేశానికి తరలించనున్నట్టు ఇంగ్లండ్ క్రికెట్ ఆదివారం వెల్లడించింది. సఫారీలతో శనివారం ముంబైలోని వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో టాప్లే చూపుడు చేతికి గాయమైంది. సత్వర ట్రీట్మెంట్ కోసం మైదానం వీడిని అతడు డెత్ ఓవర్లలో మళ్లీ బౌలింగ్ చేసినా.. బంతిని సరిగ్గా పట్టుకోలేకపోయాడు. మ్యాచ్ అనంతరం టాప్లేకు స్కానింగ్ పరీక్షలు జరిపిన వైద్యులు అతడి ఎముక విరిగినట్టు గుర్తించారు.
టోప్లే స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది. అయితే.. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కాడ్‌లో ఒకడైన జోఫ్రా ఆర్చర్‌ను ఎంపిక చేస్తారా? అనే వార్తల్ని కోచ్ మాథ్యూ మ్యాట్ కొట్టిపారేశాడు. దాంతో, బ్రైడన్ కర్సే, మాథ్యూ పాట్స్, జార్జ్ స్క్రిమ్షాతో పాటు యంగ్‌స్టర్ రెహాన్ అహ్మద్‌ల మధ్య పోటీ నెలకొంది. ఇంగ్లండ్ తర్వాతి మ్యాచ్‌లో అక్టోబర్ 26న శ్రీలంకతో తలపడనుంది. దక్షిణాఫ్రికా చేతిలో 229 పరుగుల భారీ తేడాతో ఓడిన బట్లర్ సేన సెమీస్ రేసులో వెనకబడిన విషయం తెలిసిందే.