ముల్తాన్: పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య ముల్తాన్లో జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఓవర్ నైట్ స్కోరు 239/6తో మూడో రోజు ఆట ఆరంభించిన ఇంగ్లీష్ జట్టు.. 291 పరుగులకు ఆలౌట్ అయింది. స్పిన్నర్ సాజిద్ ఖాన్ (7/111) ఏడు వికెట్లతో తన కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
అనంతరం పాక్ రెండో ఇన్నింగ్స్లో 221 పరుగులకే ఆలౌటైంది. సల్మాన్ (63) ఒక్కడే రాణించాడు. 297 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 11 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది.