England : భారత పర్యటనలో వరుసగా రెండు ఓటములతో షాక్ తిన్న ఇంగ్లండ్(England)కు రాంచీ టెస్టు చావోరేవో లాంటింది. నాలుగో టెస్టులో గెలుపొంది సిరీస్ సమం చేయాలని స్టోక్స్ సేన భావిస్తోంది. అందుకని రాంచీ టెస్టుకు బలమైన జట్టును ప్రకటించింది. మార్క్‌వుడ్, రెహాన్ అహ్మద్‌లను తప్పించి.. ఫామ్‌లో ఉన్న పేసర్ ఓలీ రాబిన్సన్, యువ స్పిన్నర్ షోయబ్ బషీర్‌లను తుది జట్టులోకి తీసుకుంది. సిరీస్ అప్పగిస్తారా? ఆడుతారా?
ఇంగ్లండ్ జట్టు : జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), టామ్ హర్ట్లే, ఓలీ రాబిన్సన్, జేమ్స్ అండర్సన్, షోయబ్ బషీర్.
We have named our XI for the fourth Test in Ranchi! 🏏 👇
🇮🇳 #INDvENG 🏴 #EnglandCricket
— England Cricket (@englandcricket) February 22, 2024
ఐదు టెస్టుల సిరీస్‌ను విజయంతో ఆరంభించిన ఇంగ్లండ్ అనూహ్యంగా వరుసగా రెండు మ్యాచుల్లో ఓడింది. టాపార్డర్, మిడిలార్డర్ వైఫల్యంతో వైజాగ్, రాజ్‌కోట్ టెస్టుల్లో దారుణ ఓటమి చవిచూసింది. సిరీస్‌లో కీలకమైన రాంచీ టెస్టులో గెలుపే లక్ష్యంగా స్టోక్స్ సేన సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ స్టోక్స్ బౌలింగ్ చేసే చాన్స్ లేకపోలేదు. నిరుడు మోకాలి సర్జరీ తర్వాత బ్యాటింగ్‌కే పరిమితమైన అతడు ఈ సిరీస్‌లో తొలిసారి బౌలింగ్ చేయనున్నాడు.
మరోవైపు వైజాగ్, రాజ్‌కోట్ టెస్టు విజయాలతో జోరుమీదున్న టీమిండియా నాలుగో టెస్టులోనూ విజయంపై కన్నేసింది. శుక్రవారం రాంచీ వేదికగా జరిగే నాలుగో మ్యాచ్‌లోనే సిరీస్ పట్టేయాలనే లక్ష్యంతో వ్యూహాలు పన్నుతోంది. అందులో భాగంగానే స్పిన్ పిచ్ సిద్ధం చేసింది. అయితే.. భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ పిచ్ ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పలేనని అన్నాడు. పిచ్‌పై పగుళ్లు ఉన్నమాట వాస్తవమే. కానీ, రాంచీ పిచ్ ఎప్పుడు టర్న్ అవుతుంది? ఎంత మేరకు స్పిన్నర్లకు అనుకూలిస్తుంది? అనేది మాత్రం చెప్పలేనని రాథోర్ తెలిపాడు.