ED Searches : విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం హిరనందానీ గ్రూప్‌కు చెందిన కార్యాలయాలు, సముదాయాలపై దాడులు చేపట్టింది. గ్రూప్‌పై నిర్ధిష్టంగా ఏయే ఆరోపణలపై సోదాలు నిర్వహించారనే పూర్తి వివరాలు ఇప్పటివరకూ వెల్లడికాలేదు.
నిర్మాణ రంగంలో నాలుగు దశాబ్ధాలకుపైగా అనుభవం కలిగిన ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా పేరొందిన హిరనందానీ గ్రూప్‌పై ఈడీ దాడులు కలకలం రేపాయి. హిరనందానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు నిరంజన్ హిరనందానీ సహ వ్యవస్ధాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
Read More :
Lottery | జాక్‌పాట్.. లాటరీలో రూ.795 కోట్లు గెలుచుకున్న చైనా యువకుడు