లండన్: భారత మహిళల క్రికెట్ జట్టుతో జరిగే ఏకైక టెస్టుకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు బుధవారం జట్టును ప్రకటించింది. 17 మంది మహిళలతో కూడిన జట్టును ఎంపిక చేసింది. స్టార్ బ్యాట్స్‌మన్ హీథర్ నైట్ ఇంగ్లాండ్ మహిళల జట్టుకు సారథ్యం వహించనుంది. పేసర్ ఎమిలీ అర్లోట్ ఇంగ్లాండ్ విమెన్స్ జట్టు తరఫున అరంగేట్రం చేయబోతోంది. జూన్ 16 నుంచి 19 వరకు బ్రిస్టల్ వేదికగా ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో భారత్ ఆడనుంది. టెస్టు, వన్డే మ్యాచ్‌ల్లో భారత జట్టుకు మిథాలీ రాజ్ సారథ్యం వహించనుండగా..టీ20ల్లో హర్మన్‌ప్రీత్ జట్టుకు నాయకత్వం వహించనుంది.
ఇంగ్లాండ్ మహిళల టీమ్ ఇదే!
హీథర్ నైట్, ఎమిలీ అర్లోట్, టామీ బ్యూమంట్, క్యాథరీన్ బ్రంట్, కేట్ క్రాస్, ఫ్రెయా డెవిస్, సోఫియా డంక్లే, సోఫీ ఎక్లీస్టోన్, జార్జియా ఎల్విస్, తాష్ ఫరాంట్, సారా గ్లెన్, అమీ జోన్స్, నాట్ సివర్, అన్య ష్రబ్సోల్, మ్యాడీ విల్లియర్స్, ఫ్రాన్ విల్సన్, లారెన్ విన్ఫీల్డ్ హిల్
ICYMI
— England Cricket (@englandcricket) June 9, 2021
We named our squad for the LV= Insurance Test match against India, starting June 16. pic.twitter.com/EBEEoyMPzk