Edgbaston Test : ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్(269) డబుల్ సెంచరీతో భారీ స్కోర్ చేసిన టీమిండియా అనంతరం ఇంగ్లండ్ మూడు వికెట్లు తీసింది. ఓపెనర్ డకెట్, ఓలీ పోప్‌ను డకౌట్ చేసిన ఆకాశ్ దీప్(2-36) ఆతిథ్య జట్టును దెబ్బ కొట్టగా.. సిరాజ్ సైతం విజృంభించి డేంజరస్ జాక్ క్రాలే(19)ను వెనక్కి పంపాడు. టాపార్డర్ వైఫల్యంతో కష్టాల్లో పడిన జట్టను జో రూట్(18 నాటౌట్), హ్యారీ బ్రూక్(30 నాటౌట్) ఆదుకున్నారు. ఆఖరి నలభై నిమిషాలు వికెట్ కాపాడుకున్న ఈ జోడీ రన్స్ రాబట్టింది. దాంతో, రెండో రోజు ఆట ముగిసే సరికి స్టోక్స్ సేన 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 510 రన్స్ వెనకబడి ఉంది.
Stumps on Day 2 in Edgbaston!
End of a tremendous day with the bat and ball for #TeamIndia 🙌
England 77/3 in the first innings, trail by 510 runs
Scorecard ▶️ https://t.co/Oxhg97g4BF#ENGvIND pic.twitter.com/GBKmE34pgM
— BCCI (@BCCI) July 3, 2025
ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్‌కు బిగ్ షాక్. భారత పేసర్ ఆకాశ్ దీప్ (2-12) నిప్పులు చెరగడంతో ఆ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆకాశ్ ఒకే ఓవర్లో తొలుత బెన్ డకెట్(0)ను ఔట్ చేసి ఇండియాకు బ్రేకిచ్చాడు. ఆ తర్వాత బంతికే తొలి టెస్టు సెంచరీ వీరుడు ఓలీ పోప్(0)ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. రాహుల్ క్యాచ్ అందుకోవడంతో.. 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది ఆతిథ్య జట్టు.