ODI World Cup | ప్రపంచకప్-2023 టోర్నీలో భాగంగా ఆదివారం ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నది. 285 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఏడు ఓవర్లలోపే 33 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ జానీ బరిష్టా.. ఫజలాఖ్ ఫరూఖీ బౌలింగ్లో రెండో ఓవర్ తొలి బంతికి ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. జానీ బరిష్టా స్థానం వన్ డౌన్గా వచ్చిన జాయ్ రూట్.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ బౌలింగ్ బౌల్డయి పెవిలియన్ బాట పట్టాడు. అప్పటికి ఇంగ్లండ్ స్కోర్ 33 పరుగులు మాత్రమే.. ఎనిమిది ఓవర్లు పూర్తయ్యే సరికి మరో ఒక వైడ్, రెండు సింగిల్స్ తో ఇంగ్లండ్ స్కోర్ 36 పరుగులు. అంతకుముందు ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 49.5 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ 80, ఇబ్రహీం జాడ్రన్ 28, ఇక్రం అలిఖిల్ 58, ముజీం ఉర్ రెహ్మాన్ 28 పరుగులు చేశారు.