Team India Vs England | ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో యుజువేంద్ర చాహల్ చెలరేగిపోతున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన మూడు వికెట్లు తీశాడు. దీంతో 22వ ఓవర్లో చాహల్ వేసిన స్ట్రెయిట్ బంతిని ఆడబోయిన బెన్ స్టోక్ ఎల్బీడబ్ల్యూ అయి పెవిలియన్ బాట పట్టాడు. అంతకుముందు జోరూట్‌ను ఎల్బీ డబ్ల్యూ చేయగా, ఓపెనర్ జానీ బెయిర్స్టోనూ బౌల్డ్ చేశాడు. 22 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది ఇంగ్లండ్. ప్రస్తుతం క్రీజ్‌లో లియాం లివింగ్ స్టోన్, మోయిన్ ఆలీ ఉన్నారు. అంతకుముందు 20 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 99 పరుగులు చేసింది.
టీం ఇండియాతో ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ గురువారం రెండో వన్డే ఆడుతున్నది. 21 ఓవర్లు పూర్తయ్యే సరికి 102 పరుగులు చేసింది. మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా చెరో వికెట్, చాహల్ రెండు వికెట్లు తీశారు. ప్రమాదకరంగా బ్యాటింగ్ చేస్తున్న జోరూట్ (11) 18వ ఓవర్లో కీలక అవుటయ్యాడు.18 ఓవర్లు ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. 18వ ఓవర్లో చాహల్ వేసిన నాలుగో బంతిని ఆడబోయిన జోరూట్ ఎల్బీ డబ్ల్యూ అయ్యాడు.