Eng Vs SL | లండన్: సొంతగడ్డపై శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య జట్టు రెండో రోజూ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఓవర్ నైట్ స్కోరు 74తో రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ లోయరార్డర్ ఆటగాడు గస్ అట్కిన్సన్ (118) సెంచరీతో మెరవడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 427 పరుగుల భారీ స్కోరు చేసింది.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంక.. 55.3 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో కమిందు మెండిస్ (74) టాప్ స్కోరర్. బ్యాట్‌తో సెంచరీ బాదిన అట్కిన్సన్ బంతితోనూ (2/40) రాణించాడు. వోక్స్, స్టోన్, పాట్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.