వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో ఇంగ్లండ్ యువ బ్యాటర్ హారీ బ్రూక్(91 బంతుల్లో 123, 11ఫోర్లు, 5సిక్సర్లు) మెరుపు సెంచరీతో సత్తాచాటాడు. శుక్రవారం మొదలైన రెండో టెస్టులో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లిష్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 280 స్కోరుకు ఆలౌటైంది. ఓపెనర్లు బెన్ డకెట్(0), జాక్ క్రాలీ(17), బెతెల్(16), రూట్(3) తీవ్రంగా నిరాశపరిచారు.
అయితే బ్రూక్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఒలీ పోప్(66)తో కలిసి ఐదో వికెట్‌కు 174 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన బ్రూక్.. జట్టును ఒడ్డు న పడేశాడు. స్మిత్‌కు నాలుగు, ఒరూర్క్ మూడేసి వికెట్లు పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ మొదటి రోజు ఆట ముగిసే సరికి 86-5తో కష్టాల్లో పడింది. విలియమ్సన్ (37) తప్పా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. కార్స్‌కు రెండు వికెట్లు దక్కాయి.