చెస్టర్ లీ స్ట్రీట్: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ అదిరిపోయే బోణీ కొట్టింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 21 పరుగుల తేడాతో విండీస్‌పై విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. తొలుత జోస్ బట్లర్(59 బంతుల్లో 96, 6ఫోర్లు, 4సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీతో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 188-6 స్కోరు చేసింది.
విండీస్ బౌలర్లను ఉతికిఆరేస్తూ బట్లర్ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. అనంతరం ఛేదనకు దిగిన విండీస్.. 20 ఓవర్లలో 167-9 స్కోరు చేసింది.