అక్లాండ్: న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. గురువారం ఇరు జట్ల మధ్య జరుగాల్సిన మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ వర్షం అంతరాయం కల్గించే సమయానికి 3.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది.
అయితే ఎడతెరిపి లేని వర్షంతో మైదానం మొత్తం చిత్తడిగా మారింది. ఆటకు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా, రెండో మ్యాచ్ గెలిచిన ఇంగ్లండ్ సిరీస్ను 1-0తో కైవసం చేసుకుంది. బ్రూక్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు.