పెర్త్: పరుగుల వరద పారిన పోరులో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఓపెనర్లు అలెక్స్ హేల్స్ (51 బంతుల్లో 84; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), జోస్ బట్లర్ (32 బంతుల్లో 68; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో ఎలీస్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 200 పరుగులకు పరిమితమైంది. విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ (44 బంతుల్లో 73; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), మిషెల్ మార్ష్ (36), స్టొయినిస్ (35) పోరాడినా ఫలితం లేకపోయింది. చివరి ఓవర్లో పొదుపుగా బౌలింగ్ చేసిన సామ్ కరన్ ఇంగ్లిష్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలెక్స్ హేల్స్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.