ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో కూడా కోహ్లీ మెరవలేదు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి మంచి టచ్‌లో కనిపించిన కోహ్లీ.. ఈసారి భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించాడు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పెవిలియన్ చేరాడు. స్టోక్స్ వేసిన బంతిని డిఫెన్స్ చేసేందుకు కోహ్లీ ప్రయత్నించాడు.
అయితే ఎక్స్ట్రా బౌన్స్ అయిన బంతి అతని గ్లవ్స్‌ను తాకి వెనక్కు వెళ్లింది. కీపర్ బిల్లింగ్స్ దాన్ని అందుకోబోయి విఫలమయ్యాడు. అయితే పక్కనే స్లిప్స్‌లో ఉన్న రూట్ వెంటనే రియాక్ట్ అయ్యి క్యాచ్ అందుకోవడంతో కోహ్లీ వెనుతిరిగాడు.