బీజేపీ పాలిత బీహార్ రాష్ట్రంలో దొంగల భయం ఏ స్థాయిలో ఉందో చెప్పే ఘటన ఇది. ఓ వ్యక్తి తన కారును క్రేన్ సాయంతో రెండో అంతస్తులోకి తరలించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గోపాల్గంజ్కు చెందిన మనోజ్ యాదవ్ మహీంద్రా స్కార్పియో క్లాసిక్ కారును కొన్నాడు.
అతను ఇజ్రాయెల్లో పనిచేస్తుండగా.. కొన్ని రోజులు డ్రైవర్ దగ్గరే కారును ఉంచారు. కానీ ఇటీవల డ్రైవర్ వెళ్లిపోవడంతో కారును దొంగల నుంచి కాపాడుకోడానికి అతని ఫ్యామిలీ ఓ నిర్ణయం తీసుకుంది. క్రేన్ సాయంతో ఎస్యూవీ కారును తమ బిల్డింగ్ రెండో అంతస్తులోకి ఎక్కించారు.