ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో అవకాశం దక్కించుకున్న తెలుగు కుర్రాడు హనుమ విహారి (11) రెండో ఇన్నింగ్స్‌లో కూడా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 20 పరుగులే చేసిన విహారి.. రెండో ఇన్నింగ్స్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడతాడని అభిమానులు ఆశించారు. కానీ అతను ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు.
ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (4) విఫలమవడంతో క్రీజులోకి వచ్చిన అతను.. కాసేపు పుజారా (22 నాటౌట్)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అయితే స్టువర్ట్ బ్రాడ్ వేసిన 17వ ఓవర్లో ఆఫ్ స్టంప్ ఆవల పడిన బంతిని డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతి థర్డ్ స్లిప్స్‌లో ఉన్న బెయిర్‌స్టో చేతుల్లో పడింది. దీంతో విహారి ఇన్నింగ్స్ ముగిసింది.