ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (4) మరోసారి నిరాశ పరిచాడు. తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన అతను.. భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మూడో బంతికే పెవిలియన్ చేరాడు. ఆండర్సన్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికి బౌండరీ బాదిన అతను..
ఆ తర్వాతి బంతిని డిఫెండ్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్స్‌లో ఉన్న క్రాలీ వైపు వెళ్లింది. అతను సులభమైన క్యాచ్ అందుకోవడంతో గిల్ ఇన్నింగ్స్ ముగిసింది.