దళితులకిచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి.. అసెంబ్లీ సాక్షిగా సీఎం దిగజారుడు రాజకీయాలు
చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సహా దళితులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి డిమాండ్ చేశారు. దళిత అభ్యున్నతికి గత కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తే, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఫేక్ ప్రచారాలు, డైవర్షన్ రాజకీయాలతో కాలం వెళ్లదీస్తున్నదని ఆరోపించారు.
- శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సహా దళితులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి డిమాండ్ చేశారు. దళిత అభ్యున్నతికి గత కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తే, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఫేక్ ప్రచారాలు, డైవర్షన్ రాజకీయాలతో కాలం వెళ్లదీస్తున్నదని ఆరోపించారు. అంబేదర్ ఆశయ సాధనకు కేసీఆర్ ప్రాధాన్యమిచ్చారని, అందుకే హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు నూతన సచివాలయానికి అంబేదర్ పేరు పెట్టారని కొనియాడారు. 70 ఏండ్ల కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల మగ్గిపోయిన దళిత కుటుంబాలకు రూ.10 లక్షలు నేరుగా అందించే విప్లవాత్మక దళితబంధును కేసీఆర్ ప్రవేశపెట్టారని గుర్తుచేశారు.
ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. అంబేదర్ అభయహస్తం కింద రూ.12 లక్షల సాయం చేస్తామని గ్యారంటీ కార్డులిచ్చి మోసం చేయడమే కాకుండా, పాత దళితబంధును పకనబెట్టారని మండిపడ్డారు. పదో తరగతి నుంచి పీహెచ్డీ వరకు విద్యార్థులకు రూ.10వేల నుంచి రూ.5 లక్షల వరకు ఇస్తామన్న హామీలను గాలికొదిలేశారన్నారు. అసెంబ్లీలో కార్యకర్తల ఫేక్ ఐడీలతో తయారుచేసిన కంటెంట్‌ను ప్రదర్శిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి దిగజారుడుతనానికి పరాకాష్టగా నిలిచారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రతిపక్షాల ప్రశ్నల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే సీఎం రేవంత్ రాజీనామా రాగం అందుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ చావును కోరుకునేలా వ్యాఖ్యలు చేయించడం, నివాసంపై దాడులను ప్రోత్సహించడం కాంగ్రెస్ పాశవిక రాజకీయాలకు నిదర్శనమని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sweet Corn | మీ డైట్లో స్వీట్ కార్న్ ఉందా.. అయితే మీ ఆరోగ్య సమస్యలకు మీరు చెక్ పెడుతున్నట్టే..!
Rinku Singh | సమాజ్‌వాది పార్టీ ఎంపీని పెళ్లి చేసుకోబోతున్న క్రికెటర్ రింకూ సింగ్.. ఆమె ఎవరంటే..!
Pregnancy | 30 ఏళ్ల వయస్సులో గర్భం దాల్చడం కష్టమవుతుందా.. అండాల సంఖ్య తగ్గుతుందా..?
Bulgaria Accident | పొగమంచు ఎఫెక్ట్.. ఒకదానినొకటి ఢీకొన్న 86 వాహనాలు.. 12 మంది మృతి
Health Tips | వ్యాయామం చేసేటప్పుడు ఏదిపడితే అది తింటే ప్రమాదం.. ఎందుకో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

