HomeSportsEng Vs Ind Hardik Pandya Departs As India Loses Fifth Wicket
ENG vs IND | ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. పాండ్యా అవుట్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. బంతితోపాటు బ్యాటుతోనూ అద్భుతంగా రాణించిన హార్దిక్ పాండ్యా (71) అవుటయ్యాడు. కార్సే వేసిన 36వ ఓవర్ మూడో బంతిని పుల్ చేయడానికి ప్రయత్నించిన పాండ్యా విఫలమయ్యాడు.
ఈ క్రమంలో టైమింగ్ మిస్సయిన హార్దిక్.. మిడ్‌వికెట్ వద్ద ఉన్న స్టోక్స్ వైపు బంతిని పంపాడు. ముందుకు డైవ్ చేసిన స్టోక్స్ ఆ క్యాచ్ పూర్తిచేయడంతో హార్దిక్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత జట్టు 205 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.