ఎడ్జ్‌బాస్టన్ టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ఆరంభించిన ఇంగ్లండ్‌ను టీకి ముందు బుమ్రా దెబ్బతీశాడు. క్రాలీ (46)ను పెవిలియన్ చేర్చాడు. అనంతరం టీ బ్రేక్ తర్వాత తొలి బంతికే ఓలీ పోప్ (0)ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. బుమ్రా వేసిన బంతిని పోప్ సరిగా అంచనా వేయలేకపోయాడు.
ఈ క్రమంలో లైట్ ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ పంత్ వైపు వెళ్లింది. అతను దాన్ని చక్కగా అందుకోవడంతో పోప్ వెనుతిరిగాడు. ఆ తర్వాతి ఓవర్లోనే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న అలెక్స్ లీస్ (56) పెవిలియన్ చేరాడు. జడ్డూ వేసిన బంతిని డిఫెన్స్ చేయడానికి ప్రయత్నించగా ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి లెగ్ సైడ్ వెళ్లింది. ఈ సమయంలో అనవసర పరుగు కోసం ప్రయత్నించిన పోప్ రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో జో రూట్ (1 నాటౌట్), జానీ బెయిర్‌స్టో (4 నాటౌట్) ఉన్నారు.